వివిధ దేశాల టిక్‌టాక్ వీడియోల‌ను అకౌంట్ లేకుండా చూపెట్టే - టిక్‌టాక్ ఫ‌ర్ వెబ్ 

టిక్‌టాక్ వీడియోలు అందరికీ ఇష్టమే. అయితే ఎవరివైనా టిక్‌టాక్ వీడియోలు చూడాలంటే మనకు మనకు టిక్‌టాక్ అకౌంట్ ఉండాలి. కానీ అకౌంట్ లేకుండా కూడా టిక్‌టాక్  వీడియోలు చూడ్డానికి మంచి లభ్యం ఒకటి ఉంది. అదే టిక్‌టాక్ వెబ్. దీనిలోకి వెళితే దేశదేశాల టిక్‌టాక్ యూజర్లు చేసిన  వీడియోలను ఎలాంటి అకౌంట్ లేకుండా ఎంచక్కా చూసేయొచ్చు. అంతేకాదు ఆ యూజర్ల వీడియోలను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. టిక్ టాక్ టీవీకూడా ఈ వెబ్‌సైట్‌లో  చూడొచ్చు. మొత్తంగా చెప్పాలంటే టిక్ టాక్ వీడియోలు చూడడానికి, డౌన్లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్ అని చెప్పుకోవచ్చు. 

170 దేశాల వీడియోలు చూడొచ్చు
టిక్‌టాక్ వీడియోలను అకౌంట్ లేకుండా చూడడానికి టిక్‌టాక్ ఫర్ వెబ్ (Ticktok for web) అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఇది ఇది ఉచిత వెబ్‌సైట్‌.  దీనిలో టిక్‌టాక్ వీడియోలను ఎలాంటి అకౌంట్ లేకుండా నేరుగా చూడొచ్చు. వీడియోలను ఆయా దేశాల వారీగా దేశాల వారీగా అందుబాటులో ఉంచారు. మీరు scroll down చేసుకొని కావలసిన దేశపు టిక్‌టాక్ వీడియోలను చూడొచ్చు. టిక్‌టాక్  ఫర్ వెబ్ యాప్ ఓపెన్ చేయగానే యునైటెడ్ స్టేట్స్ టిక్‌టాక్ వీడియోస్ కనిపిస్తాయి. మీరు సైట్ పైభాగంలో కుడి వైపున ఉన్న బార్‌లోకి వెళ్లి కంట్రీ మార్చుకోవచ్చు. మీరు ఏ కంట్రీ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన టిక్‌టాక్ వీడియోలు మీకు కనిపిస్తాయి. మొత్తం 170 దేశాల లిస్టు ఈ డ్రాప్ డౌన్ మెనూలో ఉంది. అంటే 170 దేశాల టిక్‌టాక్ యూజర్లు చేసిన వీడియోలు ఈ సైట్ లో అందుబాటులో ఉన్నాయన్నమాట.  వీడియోలతోపాటు యూజర్ నేమ్, ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారు, కామెంట్లు వంటి వివరాలన్నీ చూడొచ్చు. ఆ వీడియో మీకు నచ్చితే దాన్ని తయారుచేసిన యూజర్ ప్రొఫైల్ లోకి వెళ్లి వారు చేసిన మరిన్ని వీడియోలను కూడా చూడొచ్చు. Website పైన ఉన్న సెర్చ్ బార్ లో హ్యాష్‌స్టాగ్ ద్వారా కూడా వీడియోలు సెర్చ్ చేయొచ్చు.  

ఇంకా ఇవీ ప్రత్యేకతలు 
* టిక్‌టిక్ ఫ‌ర్ వెబ్ అనే  వెబ్ సైట్ లో వీడియోలను నేరుగా అకౌంట్ లేకుండా చూడడమే కాదు వాటిని ఫేస్బుక్, ట్విట్టర్ లో డైరెక్ట్ గా షేర్ చేయవచ్చు కూడా. 


* ఈ వెబ్‌సైట్ టిక్‌టాక్ టీవీ, టిక్‌టాక్ వీడియో డౌన్‌లోడ‌ర్‌ను కూడా అందిస్తుంది. 

* వీడియో యూఆర్ఎల్‌ను డౌన్‌లోడ‌ర్‌లో ఎంటర్ చేసి ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

170 దేశాల టిక్‌టాక్ వీడియోలు టిక్‌టాక్ ఫ‌ర్ వెబ్‌ టిక్‌టాక్ వీడియోల వెబ్‌సైట్‌ Ticktok for web 170 countries ticktok videos